నార్నూర్​లో నీతి అయోగ్ బృందం

నార్నూర్​లో నీతి అయోగ్ బృందం

ఆదిలాబాద్, వెలుగు: నీతి అయోగ్ బృందం సభ్యులు మంగళవారం నార్నూర్ మండలంలో పర్యటించారు. సభ్యులు మృత్యుంజయ ఝా, సుభోద్ కుమార్ తోపాటు కలెక్టర్ రాజర్షి షా కలిసి ప్రభుత్వం పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్బంగా మండలలో డిగ్రీ కాలేజీ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని వారికి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాబోధన, వసతుల  గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు.